ఇండియా వైడ్ రెండో ఫ్రైడే బుకింగ్స్ లో “కల్కి” సెన్సేషన్

ఇండియా వైడ్ రెండో ఫ్రైడే బుకింగ్స్ లో “కల్కి” సెన్సేషన్

Published on Jul 6, 2024 12:02 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వైడ్ గా గట్టిగా వినిపిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కం యాక్షన్ డ్రామా భారీ వసూళ్ళని అందుకొని దూసుకెళ్తుండగా మరో సెన్సేషనల్ సెకండ్ వీకెండ్ కి అయితే వచ్చింది.

అయితే ఈ రెండో వీకెండ్ లో కూడా ఈ చిత్రం భారీ బుకింగ్స్ నమోదు చేస్తుండగా ఈ పెర్ఫామెన్స్ నిన్న శుక్రవారం నుంచే సాలిడ్ లెవెల్లో మొదలయ్యింది అని చెప్పాలి. అయితే రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా చిత్రాల్లో రెండో శుక్రవారంకి గాను కల్కి హైయెస్ట్ బుకింగ్స్ తో రికార్డు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

బుక్ మై షో బుకింగ్స్ లో కల్కి అయితే రెండో శుక్రవారంకి గాను 5 లక్షలకి పైగా బుకింగ్స్ ని నమోదు చేసినట్టుగా ఏ ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాతో పోల్చినా కూడా అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా రెండు స్థానాల్లో అనిమల్, జవాన్ సినిమాలు నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు