అక్కడ వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో “కల్కి” మ్యానియా

అక్కడ వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో “కల్కి” మ్యానియా

Published on Jul 5, 2024 10:56 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేసిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ లార్జర్ దన్ లైఫ్ చిత్రం వాటిని అందుకొని రికార్డు వసూళ్లు ఇప్పుడు నమోదు చేస్తుంది. అయితే ఒక సెన్సేషనల్ వీకెండ్ రన్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా భారీ వసూళ్లు అందుకొని అదరగొడుతుంది.

మెయిన్ గా యూఎస్ నార్త్ అమెరికా మార్కెట్ లో అయితే కల్కి కనబరుస్తున్న స్ట్రాంగ్ హోల్డ్ మామూలు లెవెల్లో లేదనే చెప్పాలి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం 8వ రోజు సాయంత్రానికి 6 లక్షల 90 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకొని 14.69 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఇప్పుడు అందుకుంది. ఇది గడిచిన రెండు వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ అన్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తంగా అయితే ఈ భారీ చిత్రం మ్యానియా యూఎస్ మార్కెట్ లో మామూలు స్థాయిలో లేదని చెప్పి తీరాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు