బుక్ మై షోలో ”క‌ల్కి” సెన్సేష‌న‌ల్ రికార్డు

బుక్ మై షోలో ”క‌ల్కి” సెన్సేష‌న‌ల్ రికార్డు

Published on Jul 8, 2024 1:20 PM IST

పాన్ ఇండియా స్థాయిలో ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తున్న లేటెస్ట్ మైథాల‌జీ సైఫై మూవీ ‘క‌ల్కి 2898 AD’ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న జోరును ఏమాత్రం త‌గ్గించ‌డం లేదు. ఈ సినిమా సాలిడ్ వ‌సూళ్ల‌తో దూసుకెళ్తూ ప‌లు రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాను చూసేందుకు రిపీటెడ్ ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు వ‌స్తుండ‌టంతో ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

ప్ర‌ముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫాం బుక్ మై షోలో ‘క‌ల్కి’ మూవీ ఓ అరుదైన ఫీట్ ను న‌మోదు చేసింది. ఈ ప్లాట్ ఫాంలో ఏకంగా కోటికి పైగా టికెట్లు అమ్ముడైన‌ట్లు బుక్ మై షో వెల్ల‌డించింది. అన్ని భాష‌ల్లో క‌లిపి 103.28 ల‌క్ష‌ల క‌ల్కి టికెట్లు అమ్ముడైన‌ట్లు బుక్ మై షో ప్ర‌క‌టించింది.

ప్ర‌భాస్, అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్వినీద‌త్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు