మరో ఫాస్టెస్ట్ రికార్డ్ తో “కల్కి” వసూళ్ల తుఫాన్

మరో ఫాస్టెస్ట్ రికార్డ్ తో “కల్కి” వసూళ్ల తుఫాన్

Published on Jul 4, 2024 5:01 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి భారీ హైప్ నడుమ వచ్చిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ రికార్డు వసూళ్లు అందుకొని దుమ్ము లేపుతుండగా ఇండియన్ వైడ్ గా మాత్రమే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ విడుదల అయ్యిన అన్ని చోట్ల కూడా ఈ చిత్రం సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది.

ఇక ఇదిలా ఉండగా యూఎస్ మార్కెట్ లో అయితే కల్కి మ్యానియా మాములు లెవెల్లో లేదని చెప్పాలి. ఈ చిత్రం అక్కడ ఇప్పుడు మరో రికార్డు మార్క్ 13.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసింది. దీనితో ఈ మార్క్ అందుకున్న ఫాస్టెస్ట్ సినిమాగా నార్త్ అమెరికా మార్కెట్ లో కల్కి నెంబర్ 1 గా నిలిచింది. ఇక ఇది ఇప్పుడే అయిపోలేదు. చూస్తుంటే కల్కి కి మంచి లాంగ్ రన్ పడేలా కూడా అనిపిస్తుంది. మరి లాంగ్ రన్ లో కల్కి ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు