వీక్ డేస్ లో అదరగొడుతున్న “కల్కి” ఫాస్టెస్ట్ రికార్డ్

వీక్ డేస్ లో అదరగొడుతున్న “కల్కి” ఫాస్టెస్ట్ రికార్డ్

Published on Jul 3, 2024 7:02 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా అలాగే దిశా పటాని (Disha Patani) ఫీమేల్ లీడ్ లో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ మరింత ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి” మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఎన్నో రికార్డులు మొదటి వారాంతం లోనే తిరగరాసింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఫస్ట్ వీకెండ్ లో సెన్సేషనల్ వసూళ్లు రాబట్టగా వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా కల్కి సత్తా చాటుతుండడం విశేషం. మెయిన్ గా సోమవారం రికార్డు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మంగళవారం కూడా సాలిడ్ అక్యుపెన్సీ లను నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

ఇంకా మల్టీప్లెక్స్ లలో అయితే హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయట. దీనితో వీక్ డేస్ లో కూడా కల్కి సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు