నైజాంలో ఆగ‌ని ‘క‌ల్కి’ వ‌సూళ్ల ప‌ర్వం!

నైజాంలో ఆగ‌ని ‘క‌ల్కి’ వ‌సూళ్ల ప‌ర్వం!

Published on Jul 8, 2024 12:52 PM IST

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గ‌ర్ ఏమాత్రం స్లో అవ‌డం లేదు. ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు దాటినా కూడా ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేట‌ర్ల వ‌ద్ద బారులు తీరుతున్నారు. ఇక అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా రికార్డు క‌లెక్ష‌న్స్ రాబడుతూ ప‌లు రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.

నైజాం ఏరియాలో క‌ల్కి మూవీ వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఆదివారం నాటికి జీఎస్టీతో క‌లుపుకుని రూ.80 కోట్ల మేర వ‌సూళ్లు సాధించింది. జూలై 12న భార‌తీయుడు-2 సినిమా రిలీజ్ అవుతుండ‌టంతో ఆలోపే వంద కోట్ల మార్క్ దాటేస్తుంద‌ని సినీ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు.

కేవ‌లం నైజాంలోనే వంద కోట్ల వ‌సూళ్ల రాబ‌ట్టి క‌ల్కి న‌యా రికార్డుల‌ను సృష్టించ‌డం ఖాయ‌మని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సైఫై విజువ‌ల్ వండ‌ర్ మూవీని నిర్మాత సి.అశ్వినీద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు