ఓటిటిలో ‘క‌ల్కి’.. మామూలు ప్లానింగ్ కాదుగా!

ఓటిటిలో ‘క‌ల్కి’.. మామూలు ప్లానింగ్ కాదుగా!

Published on Jun 23, 2024 3:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ కోసం అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించగా, పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఇది రానుంది. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ సినిమాపై నెల‌కొన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి.

అయితే, ఈ సినిమా జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఓటిటిలో వ‌చ్చాక చూద్దాంలే అని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. వారికి చిత్ర యూనిట్ ఓ సాలిడ్ షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎలాంటి పోటీ లేకుండా వ‌స్తున్న క‌ల్కి చిత్రాన్ని థియేటర్ల‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని భావించిన మేక‌ర్స్, ఈ సినిమా ఓటిటి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నార‌ట‌.

క‌ల్కి సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన 56 రోజుల‌కు త‌గ్గ‌కుండా ఓటిటిలో స్ట్రీమింగ్ చేసే ప్ర‌స‌క్తే లేకుండా ఓటిటి రైట్స్ ను ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఓ సినిమా రిలీజ్ అయిన 4 వారాల్లోనే ఓటిటిలో వస్తున్న ఈ త‌రుణంలో 8 వారాలకు డీల్ కుదుర్చుకున్న క‌ల్కి మేక‌ర్స్ ఆలోచ‌న‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏదేమైనా క‌ల్కి 8 వారాలు దాటితేనే ఓటిటిలోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు