“కల్కి” మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే.!

“కల్కి” మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే.!

Published on Jul 4, 2024 3:57 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమా భారీ వసూళ్లతో ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపుతుంది. ఇలా రిలీజ్ అయ్యిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభాస్ తన మాస్ ర్యాంపేజ్ చూపిస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి వారం రన్ ని అయితే పూర్తి చేసుకుంది. అయితే వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్న ఈ చిత్రం 7వ రోజు కూడా సాలిడ్ వసూళ్లు అందుకుంది.

లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం 45 కోట్ల గ్రాస్ ని అందుకుందట. దీనితో మొత్తం 7 రోజుల్లో కల్కి భారీ మొత్తం 725 కోట్ల గ్రాస్ కి చేరింది. ఇలా ఇప్పుడు ఈ చిత్రం 1000కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకోణ్ లాంటి దిగ్గజ నటులు కూడా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు