వరల్డ్ వైడ్ “కల్కి” 6 రోజుల భారీ వసూళ్ల వివరాలు

వరల్డ్ వైడ్ “కల్కి” 6 రోజుల భారీ వసూళ్ల వివరాలు

Published on Jul 3, 2024 10:56 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా సహా వరల్డ్ వైడ్ సినిమా దగ్గర కూడా గట్టిగా వినిపిస్తున్న తెలుగు సినిమా పేరు “కల్కి 2898 ఎడి”. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా రెబల్ స్టార్ మరియు నాగ్ అశ్విన్ లు ఒక భారీ ట్రీట్ ని అయితే వారికి అందించారు. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం రిలీజ్ రోజు నుంచే రికార్డు వసూళ్లు కొల్లగొడుతూ దూసుకెళ్తుండగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది.

ఇక ఈ 6 రోజుల్లో అయితే సెన్సేషనల్ మార్క్ ని రీచ్ అయ్యేందుకు సినిమా సిద్ధంగా ఉంది. మరి వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకి తగ్గకుండా ఈ సినిమా వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొన్న సోమవారం 70 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా మంగళవారం వరల్డ్ వైడ్ గా పి ఆర్ లెక్కల ప్రకారం 55 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది.

దీనితో ఈ చిత్రం 6 రోజుల్లో 680 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈ చిత్రం అందుకుంది. దీనితో ఈ బుధవారం వసూళ్లతో రికార్డు మార్కు 700 కోట్ల క్లబ్ లో సినిమా చేరుతుంది అని చెప్పాలి. అలాగే మళ్ళీ ఈ వారాంతంలో కూడా వసూళ్లు పెరిగేందుకు ఛాన్స్ లు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు