టికెటింగ్ యాప్స్ లో “కల్కి” సెన్సేషన్!

టికెటింగ్ యాప్స్ లో “కల్కి” సెన్సేషన్!

Published on Jun 24, 2024 4:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD చిత్రం జూన్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రతి ఒక్కరిలో కూడా సినిమాను చూడాలన్న ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. డే 1 వసూళ్లు అయితే రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, బుక్ మై షో మరియు పేటీయం టికెట్స్ లలో కల్కి కు 3 మిలియన్స్ కు పైగా ఇంట్రెస్ట్స్ లు వచ్చాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మించగా, సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం ను అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు