అక్కడ రిలీజ్ కి ముందే 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో “కల్కి”

అక్కడ రిలీజ్ కి ముందే 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో “కల్కి”

Published on Jun 23, 2024 7:20 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ చిత్రం నార్త్ అమెరికా లో సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 3 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది కచ్చితంగా సినిమా క్రేజ్ ను సూచిస్తుంది.

ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు