నార్త్ అమెరికా లో “కల్కి” కి సెన్సేషన్ రెస్పాన్స్!

నార్త్ అమెరికా లో “కల్కి” కి సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Jun 14, 2024 7:02 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి (Kalki 2898AD). జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నార్త్ అమెరికాలో జూన్ 26 వ తేదీన ప్రీమియర్ షోలతో సినిమా స్టార్ట్ కానుంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం ప్రీ సేల్స్ తో 1.5 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. వేగంగా 1.5 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా కల్కి నిలిచింది.

ఈ చిత్రం డే1 భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయం అని తెలుస్తుంది. రిలీజైన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. విజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు