జై బాలయ్య వీడియో సాంగ్ పై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Published on Nov 28, 2021 5:25 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రం ను ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబో లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి జై బాలయ్య పాటను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జై బాలయ్య సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది. తాజాగా ఈ పాట పై నందమూరి కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జై బాలయ్య, బాలయ్య ఫుల్ ఫ్లో లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. మాస్ జాతర ను డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ల లో చూసేందుకు ఆగలేక పోతున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :