‘ఇజం’లో సిక్స్‌ప్యాక్‌తో మెప్పించనున్న కళ్యాణ్ రామ్!

ism
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఓ సామాజిక అంశం చుట్టూ ముడిపడి ఉన్న కథతో పూరీ జగన్నాథ్ చేస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ లుక్‌కే ఆయన అభిమానులంతా ఫిదా అయిపోగా, తాజాగా ఇందులో పూరీ కళ్యాణ్ రామ్‌ని సిక్స్‌ప్యాక్ లుక్‌లో కూడా చూపించనున్నట్లు తెలిసింది.

సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో కళ్యాణ్ రామ్ అదిరిపోయేలా కనిపిస్తారని, ఆయన కెరీర్లో ఇప్పటికి ఇదే బెస్ట్ లుక్‌గా నిలుస్తుందని పూరీ చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ స్వయంగా తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో కూడా అదే నెలలో విడుదల కానుందని తెలుస్తోంది.