లేటెస్ట్..ఆ ఘటనపై కళ్యాణ్ రామ్ కూడా తన స్పందన!

Published on Nov 20, 2021 3:57 pm IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి వ్యక్తిగత దూషణ అనేది పెను దుమారం రేగుతుంది. దీనితో నందమూరి అభిమానులు మరియు వారి కుటుంబం నుంచి కూడా అధికారిక ప్రకటనలు కూడా ఇస్తున్నారు. మరి కొంత సమయం కిందటే నారా రోహిత్ ఒక ప్రెస్ నోట్ ద్వారా తన స్పందనని తెలియజేయగా ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన స్పందనని కూడా తెలియజేసారు.

“అసెంబ్లీ అనేది ప్రజాసమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడట అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచు కోవాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే పూజ్యులు తాతగారు రామా రావు గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్క సారి గుర్తుచేసుకుందాము.” అని ఈ స్టేట్మెంట్ ద్వారా తెలియజేసాడు.

సంబంధిత సమాచారం :

More