బాబాయి, తమ్ముడికి అభినందనలు తెలిపిన కళ్యాణ్ !

14th, November 2017 - 07:26:16 PM

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవర్ద్స్ విజేతల్లో బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ఉన్నారు. 2014 సంవత్సరానికి గారు ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. లెజెండ్ లో బాలయ్య నటనకు గాను ఈ అవార్డు లభించింది. 2016 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కు ఈ అవార్డు రావడం విశేషం.

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ బాబాయ్, తమ్ముడికి అభినందనలు తెలిపాడు. “2014, 2016 ఉత్తమ నటులుగా ఎంపికైన బాబాయ్, తారక్ లకు శుభాకాంక్షలు. నందమూరి కుటుంబానికి ఇదొక గర్వించదగ్గ తరుణం” అంటూ ట్వీట్ చేశాడు.