హైప్ క్రియేట్ చేస్తోన్న కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సెకండ్ సాంగ్ ప్రోమో…!

Published on Jul 20, 2022 9:00 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ ఎంతో భారీగా నిర్మించిన తాజా మూవీ బింబిసార. యాక్షన్ తో కూడిన సోషయో ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో క్యాథరీన్, వరీన హుస్సేన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ఆకట్టుకోవడంతో పాటు మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ నుండి ఓ తేనె పలుకుల అనే పల్లవితో సాగె మాస్ బీట్ సాంగ్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. ఆకట్టుకునే మాస్ బీట్ తో సాగె ఈ సాంగ్ ప్రోమోలో విజువల్స్ తో పాటు కళ్యాణ్ రామ్ స్టెప్స్ అదిరిపోగా, బీట్ కూడా ఆకట్టుకుంది. హైమత్ మొహమ్మద్, సత్య యామిని పాడిన ఈ సాంగ్ కి వారికుప్పల యాదగిరి లిరిక్స్ రాయగా చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సాంగ్ లిరికల్ వీడియో ని ఈనెల 21న, అలానే వీడియో సాంగ్ ని 23న సాయంత్రం 5 గం. 9 ని. లకు విడుదల చేయనున్నారు. త్రిగర్తల రాజు బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని, తప్పకుండా ఆగష్టు 5న రిలీజ్ కానున్న ఈ మూవీ అందరి అంచనాలు అందుకుని హిట్ అవుతుందని అంటోంది యూనిట్.

సాంగ్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :