‘బింబిసార’ రిలీజ్ ట్రైలర్ ఎప్పుడంటే … ?

Published on Jul 26, 2022 7:07 pm IST


కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార పై రోజు రోజుకు ఆడియన్స్ లో నందమూరి ఫ్యాన్స్ లో మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్న బింబిసార ఆ తరువాత టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెంచేసింది. త్రిగర్తల రాజు బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపించనున్న ఈ మూవీలో ఆయనకు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరీన్ థ్రెసా, వరీనా హుస్సేన్ నటిస్తుండగా చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కీరవాణి బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్న ఈ మూవీకి యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ బింబిసార ని నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథగా పలు యాక్షన్, కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 29న గ్రాండ్ గా జరుపనుండగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ని రేపు సాయంత్రం 5 గం. 9 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. కళ్యాణ్ రామ్ సూపర్ యాక్టింగ్ తో పాటు దర్శకుడు విశిష్ట అత్యద్భుత మేకింగ్ ఈ మూవీకి తప్పకుండా భారీ సక్సెస్ ని అందిస్తాయని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :