నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార, అమిగోస్ మూవీస్ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న మూవీ డెవిల్. దేవాన్ష్ నామా సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ పాన్ ఇండియన్ సినిమాని నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఇటీవల ఉగాది సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఈరోజు దాదాపు 500 మందితో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నన్నారట. ఈ హై ఆక్టేన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని ఫైట్ మాస్టర్ వెంకట్ రూపొందించారు మరియు ఇది టాలీవుడ్ బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్‌లలో ఒకటిగా ఉంటుందట. కాగా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మరియు మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక డెవిల్‌కి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు శ్రీకాంత్ విస్సా అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్కటి గా అప్ డేట్స్ రానున్నాయి.