ఫ్యాన్స్, ఆడియన్స్ కి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ నోట్ … !

Published on Aug 6, 2022 6:06 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార మొన్న రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అందుకుని ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. క్యాథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, ప్రకాష్ రాజ్, శ్రీనివాస రెడ్డి తదితరులు ఇతర పాత్రలు చేసారు.

మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన బింబిసార ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ పై కె హరికృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి చిరంతన్ భట్ సాంగ్స్ అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీరవాణి అందించారు. అయితే తమ మూవీ ప్రస్తుతం అందరి మనసు గెలుచుకుని పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండడంతో కొద్దిసేపటి క్రితం కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్, ఆడియన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఒక ఎమోషనల్ నోట్ ని రిలీజ్ చేసారు.

2019 సమయంలో మేము బింబిసార వర్క్ స్టార్ట్ చేసాము, ఆ తరువాత కరోనా మహమ్మారీ వలన షూటింగ్ కొన్నాళ్లుగా ఆగింది, అనంతరం అంతా చిక్కబడ్డాక మూవీని ఎన్నో వ్యయప్రయాశలతో యూనిట్ తెరకెక్కించింది. ఫైనల్ గా మీముందుకు వచ్చిన మాకు ఇంత పెద్ద విజయం అందించారు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ఇది కేవలం బింబిసార సక్సెస్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సక్సెస్ అంటూ కళ్యాణ్ రామ్ తన నోట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం :