“బింబిసార” కి సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

Published on Aug 6, 2022 7:25 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ ఒక సరైన హిట్ కోసం ఎదురు చూస్తుండగా ఈ హిట్ చాలా కాలం తర్వాత ఒకే వారంలో రెండు సినిమాల రూపంలో వచ్చిందని చెప్పాలి. మరి వీటిలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ట కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం “బింబిసార” కూడా ఒకటి.

మరి మొదటి నుంచి కూడా మంచి హైప్ తో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ అయిన దాన్ని బట్టి డెఫినెట్ గా ఒక ఫ్రాంచైజ్ గా ఉంటుంది అని తెలిపారు. ఇక నిన్న రిలీజ్ అయ్యిన ఈ సినిమాకి ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కళ్యాణ్ రామ్ నిన్ననే ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సినిమా మరింత గ్రాండ్ లెవెల్లో ఉంటుంది అని క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక ఈ భారీ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :