‘ఎన్టీఆర్ బయోపిక్’ మీద క్లారిటీ ఇచ్చిన ‘కళ్యాణ్ రామ్’ !

kalyanram78

‘నందమూరి బాలకృష్ణ’ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. తేజ దర్శకుడిగా ఉన్నప్పుడు ‘నందమూరి కళ్యాణ్ రామ్’ ఈ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. ‘ఎన్టీఆర్ చైతన్య రథానికి’ సారధి అయిన ‘హరికృష్ణ’ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తారనుకున్నారు. ఈ చిత్రంలో తను నటిస్తున్నానని వస్తున్న వార్తలు పై ఒక ఇంటర్య్వూలో కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. తేజాగారు నన్ను ఒక పాత్రలో అడిగారన్నారు, అయితే దర్శకుడు తేజ ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో, క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఇంతవరకూ క్రిష్ దగ్గరనుంచి గానీ,చిత్ర యూనిట్ దగ్గరనుంచి గానీ కళ్యాణ్ రామ్ కు మళ్ళీ నటించమని ఇంతవరకు పిలుపు రాలేదట. పిలుపు వస్తే తనకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ చిత్రంతో జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామెన్ పని చేశారు. ప్రేక్షకుల్లో ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఉన్నాయి.

Exit mobile version