లేటెస్ట్..”అమిగోస్” నుంచి ఊహించని అవతార్ లో కళ్యాణ్ రామ్.!

Published on Jan 5, 2023 12:10 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “బింబిసార” తో తన కెరీర్ లో భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కళ్యాణ్ రామ్ అయితే చేస్తున్నాడు. మరి ఆ చిత్రాల్లో రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “అమిగోస్” కూడా ఒకటి కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఒకో అప్డేట్ మరియు పోస్టర్ లు మంచి ఆసక్తిగా మారుతున్నాయి.

ఇక లేటెస్ట్ గా ఓ సరికొత్త అవతార్ లో అయితే మేకర్స్ కళ్యాణ్ రామ్ మరో పాత్రని పరిచయం చేసారు. మరి ప్రశ్నార్థకంగానే అనౌన్స్ చేసిన ఈ పాత్ర సినిమాలో మంచి సస్పెన్స్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ ఇది వరకు చూడని గెటప్ లో కనిపిస్తుండగా మేకర్స్ అయితే టీజర్ టైం కూడా లాక్ చేసారు. ఈ జనవరి 8న ఈ సినిమా టీజర్ రానున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈ చిత్రం ఫిబ్రవరి 10న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :