లేటెస్ట్: కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పై అప్డేట్!

లేటెస్ట్: కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పై అప్డేట్!

Published on Nov 6, 2022 9:50 PM IST


నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం ను సొంతం చేసుకున్నారు. అతని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఇప్పుడు అదే జోరుతో దూసుకు పోతున్నాడు కళ్యాణ్ రామ్. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ రేపు రానుంది.

నటుడికి ఇది 19వ చిత్రం. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. త్వరలో విడుదల తేదీ కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాకు బయ్యర్ల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు