గ్రాఫిక్‌ డిజైన్‌ లో ‘అశ్వత్థామ’ !

Kalyana Ram

నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా ‘అశ్వత్థామ’. కాగా దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో తన ఓన్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఈ సినిమాను చెయ్యడానికి అంగీకరించారు కళ్యాణ్ రామ్. అయితే సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా కీలకమని తెలుస్తోంది.

ముఖ్యంగా హీరోకి సంబంధించిన సీక్వెన్స్ స్ లో గ్రాఫిక్స్ హైలెట్ గా నిలుస్తాయని.. అందుకే చిత్రబృందం గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన ప్రీ ప్లాన్ ను సిద్ధం చేసుకుందట. సినిమా షూట్ జరుగుతున్న సమయంలోనే అటు గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ ను కూడా పూర్తి చెయ్యాలని చిత్రబృందం చూస్తోంది.

కాగా ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన ఓ టాప్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. మరి ఆ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక విభాగంకు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version