ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కళ్యాణ్ రామ్ “అమిగోస్”.!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కళ్యాణ్ రామ్ “అమిగోస్”.!

Published on Apr 1, 2023 10:02 AM IST

నందమూరి టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ [చిత్రం “అమిగోస్” కోసం తెలిసిందే. డోప్లాంగర్స్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయింది. కానీ చూసిన కొద్ది మందిలో కూడా చాలా మందికి నచ్చింది అని టాక్ ఉంది.

ఇక ఈ సినిమా అయితే ఓటిటి స్ట్రీమింగ్ కి చాలా సమయం తీసుకుంది అని చెప్పాలి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం అయితే ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు ఎవరైనా ఈ సినిమా మిస్ అయ్యి ఉంటే ఈసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక ఈ సాలిడ్ సినిమాకి అయితే జిబ్రాన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు