ఫుల్ స్వింగ్ లో కళ్యాణ్ రామ్ “డెవిల్” షూట్.!

ఫుల్ స్వింగ్ లో కళ్యాణ్ రామ్ “డెవిల్” షూట్.!

Published on Dec 31, 2022 10:00 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “బింబిసార” తో తాను మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత అయితే తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తుండగా ఈ చిత్రాల్లో అయితే ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డెవిల్ “ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రాన్ని నవీన్ మేడారం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుడఁగ దీనిపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో కంటిన్యూ అవుతూ సక్సెస్ ఫుల్ గా మూడో షెడ్యూల్ ని అయితే కంప్లీట్ చేసుకుంది.

మరి దీనితో యూనిట్ అంతా కూడా ఈ షూట్ కంప్లీట్ చేసాక ఓ పిక్ రిలీజ్ చేశారు. ఇక దీనితో పాటుగా ప్రామిసింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టుగా తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు