ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్ !
Published on Oct 29, 2017 1:52 pm IST


నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ గారి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టుకు సంబందించిన పనులు పూర్తవగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ పాత్రను బాలక్రిష్ణ చేస్తుండగా తాజాగా హరికృష్ణ పాత్రకు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంపిక చేశారు. ఈ వార్త నిజంగా నందమూరి అభిమానులకు శుభవార్తనే చెప్పాలి.

ఇకపోతే కథలో ముఖ్యమైన చంద్రబాబు నాయుడుగారి పాత్ర కోసం సీనియర్ నటుడు జగపతిబాబును అనుకుంటున్నారని వినికిడి. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలుకానుంది. తెలుగు సినీ, రాజకీయ రంగాల్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి.

 
Like us on Facebook