కళ్యాణ్ రామ్ “బింబిసార” ఫస్ట్ సింగిల్ అప్డేట్!

Published on Jul 10, 2022 8:36 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం బింబిసార థియేట్రికల్ ట్రైలర్ యొక్క అద్భుతమైన విజయంతో దూసుకుపోతున్నాడు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5, 2022 న థియేటర్లలో విడుదల కానుంది. మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంలోని మొదటి పాటకు సంబంధించిన భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానుంది.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :