కళ్యాణ్ రామ్ ఈ సారి ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో !

‘ఉయ్యాలా జంపాలా , మజ్ను’ చిత్రాలతో సున్నితమైన ప్రేమ కథ చిత్రాల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ విరంచి వర్మ. ఇక మజ్ను తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ వేసవిలోసెట్స్ మీదకు వెళ్లనుంది. సితార ఎంటర్టైంమ్నెట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెవి గుహన్ దర్శకత్వంలో 118 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈఏడాది మార్చి 1న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక ఈచిత్ర షూటింగ్ పూర్తి చేసిన తరువాత విరంచి వర్మ దర్శకత్వంలో తన కొత్త చిత్రంలో నటించనున్నాడు కళ్యాణ్ రామ్.

Exit mobile version