డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “కళ్యాణం కమనీయం”

Published on Feb 5, 2023 10:15 am IST

టాలీవుడ్ యంగ్ నటుడు సంతోష్ శోభన్ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ కళ్యాణం కమనీయం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 2023 న థియేటర్ల లో విడుదల అయ్యింది. డైరెక్టర్ అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

ఫిబ్రవరి 10, 2023 న ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వీడియో లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో దేవీ ప్రసాద్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రావణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :