బుల్లితెర ప్రేక్షకుల ముందుకు “కళ్యాణం కమనీయం”

బుల్లితెర ప్రేక్షకుల ముందుకు “కళ్యాణం కమనీయం”

Published on Jun 16, 2024 11:04 PM IST

యంగ్ హీరో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కళ్యాణం కమనీయం. గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం కి సంబందించిన శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

జీ తెలుగు లో వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి ప్రసారం కానుంది. యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు