బ్లాస్టింగ్ అప్ డేట్ : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jul 1, 2022 6:17 pm IST

యువ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బన్నీ, భగీరథ సినిమాల నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడు వశిష్ట్ తొలిసారిగా మెగాఫోన్ పడుతున్న మూవీ బింబిసార. క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా చారిత్రక నేపథ్యంతో పాటు ఇటు సోషల్ జానర్ లో కూడా సాగనున్న బింబిసార మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కుతుండగా కె హరికృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. గతేడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది.

భారీ బడ్జెట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక మూవీ ట్రైలర్ ని జులై 4న విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఈ మూవీ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఓ యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారు అనే డైలాగ్ తో ట్రైలర్ కి సంబందించిన చిన్న వీడియో బైట్ ని యూనిట్ రిలీజ్ చేసింది. ఆగష్టు 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపించనుండగా క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వారినా హుస్సేన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :