‘బింబిసార’ పాన్ ఇండియా రిలీజ్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ …. !

Published on Jul 5, 2022 12:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. కళ్యాణ్ రామ్ ఈ మూవీలో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసారుడి పాత్ర చేస్తున్నారు. యువ దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన ఈ చారిత్రాత్మక సోషియో ఫాంటసీ మూవీలో క్యాథరీన్ త్రెస్సా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్స్ గా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో కె. హరికృష్ణ నిర్మించిన బింబిసార పై మొదటి నుండి నందమూరి ఫాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా బాగా అంచనాలు ఉన్నాయి.

కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన బింబిసార టీజర్ ఎంతో ఆకట్టుకోగా, నేడు రిలీజ్ అయిన ట్రైలర్ తో ఒక్కసారిగా ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు కళ్యాణ్ రామ్ సమాధానాలు ఇచ్చారు. యూనివర్సల్ కాన్సెప్ట్ అపీల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో దీనిని తెలుగులోనే రిలీజ్ చేస్తారా లేక, పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన ఉందా అని ఒక విలేఖరి అడుగగా, ప్రస్తుతానికి అయితే మూవీ తెలుగులోనే రిలీజ్ అవుతుందని, మీరు ఇచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ని తప్పకుండా మా యూనిట్ కి తెలియపరచి, వీలైతే మూవీని రాబోయేరోజుల్లో మరిన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు కళ్యాణ్ రామ్. కాగా ఈ మూవీ ఆగష్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :