ఇరగతీసావ్ బాబాయ్.. అఖండపై కళ్యాణ్ రామ్ కామెంట్స్..!

Published on Dec 4, 2021 2:00 am IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని, కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా సక్సెస్‌పై నిన్నటి నుంచి సినీ ప్రముఖులు స్పందిస్తూ బాలయ్య బాబుకు మరియు చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియచేస్తున్నారు.

అయితే తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అఖండ సినిమాని ఫుల్‌గా ఎంజాయ్ చేశానని, బాబాయ్ పూర్తి స్థాయిలో ఇరగదీశాడని, ఇండస్ట్రీకి మరో బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చినందుకు టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలియచేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :