ఎన్నికల ప్రచారంలో నందమూరి హీరో !

2nd, November 2017 - 07:21:05 PM

‘’వీరభద్రాపురం గ్రామ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించ ప్రార్థన’’ ఈ కొటేషన్ తో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు 2019 లో కదా, ఎప్పుడే ఏంటి ఈ హడావిడి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే…

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ఉపేంద్ర తీస్తున్న సినిమా పేరు ‘ఎంఎల్ఎ’ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర షూటింగ్ లో భాగంగా ఒక ఫోటో బయటకు వచ్చింది. అందులో కళ్యాణ్ రామ్ ట్యాప్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ జయేంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.