“విక్రమ్” సీక్వెల్ లో రోలెక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన కమల్.!

Published on Jun 7, 2022 4:10 pm IST


ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్ గా వినిపిస్తున్న లేటెస్ట్ చిత్రం “విక్రమ్”. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించాడు. అయితే తనదైన టేకింగ్ తో ఓ రేంజ్ లో ఫీడ్ బ్యాక్ ని అందుకుంటున్న తాను మరో స్టార్ హీరో సూర్య ని మరో సాలిడ్ రోల్ లో చూపించడం మరింత ఆసక్తిగా మారిపోయింది.

మరి ఈ సినిమా క్లైమాక్స్ తో నెక్స్ట్ సినిమాలో సూర్య రోల్ ఫుల్ లెంగ్త్ లో ఉంటుంది అని ఆల్రెడీ ఒక లీడ్ ఇవ్వగా ఇప్పుడు దీనిపై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ సీక్వెల్ లో సూర్య చేసిన రోలెక్స్ రోల్ సినిమా అంతా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి అందులో విక్రమ్ వర్సెస్ రోలెక్స్ బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. మరి అలాగే వీరితో ఖైదీ నుంచి కార్తీ కూడా కనిపించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :