హాస్పిటల్ లో చేరిన కమల్ హాసన్.. ఆందోళనలో ఫ్యాన్స్!

Published on Jan 17, 2022 4:37 pm IST

సీనియర్ హీరో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరారని వార్తలు వస్తున్నాయి. కమల్ ఇటీవల అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాగా అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చాక.. కమల్ లో కరోనా లక్షణాలు కనిపించాయని.. అనుమానంతో టెస్ట్ లు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నై శ్రీ రామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

అన్నట్టు కమల్ హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే.. బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కమల్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. అలాగే కమల్ అటు శంకర్ దర్శకత్వంలోనూ మధ్యలో ఆగిపోయిన తన ‘ఇండియన్-2’ సినిమా షూటింగ్ ను కూడా తిరిగి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :