కమల్, త్రిష ల సినిమా టైటిల్ అదేనా?

kamal-hassn-trisha
కమల్ హాసన్ సరసన త్రిష ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తుందన్న విషయాన్ని మేము ముందుగానే తెలిపాం. ఈ సినిమాకు తమిళంలో ‘ఒరె ఇరవు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో జేమ్స్ బాండ్ తరహాలో యాక్షన్ సన్నివేశాలు వుంటాయని సమాచారం. రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ద్వారా కమల్ నిర్మిస్తున్నాడు. మే నుండి షూటింగ్ మొదలుకానుంది. కమల్ ఉత్తమ విలన్,పాపనాశం సినిమాలకు సంగీతం అందించిన ఘిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు

Exit mobile version