“ఇండియన్ 2” కి కమల్ డెడికేషన్.. కమల్ ఒక్కరే అలా చెయ్యగలరు

“ఇండియన్ 2” కి కమల్ డెడికేషన్.. కమల్ ఒక్కరే అలా చెయ్యగలరు

Published on Jul 7, 2024 8:59 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రాబోతున్న మరో అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2” అనే చెప్పాలి. మరి ఈ చిత్రంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించగా సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అలాగే మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం సీక్వెల్ గా రాబోతుండగా ఇప్పుడు ప్రమోషన్స్ లో మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు.

అయితే ఈ చిత్రం కోసం కమల్ హాసన్ తీసుకున్న గట్టి డెడికేషన్ ఏ పాటిదో శంకర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో కమల్ ఒక సన్నివేశంలో కోసం తాళ్లతో రోజంతా వేలాడుతూనే ఉండేవారని ఇలా మొత్తం 4 రోజులు ఉన్నారని అది కూడా తాను ప్రొస్థెటిక్ మేకప్ లో ఉన్నపుడు ఇదంతా అని చెప్పుకొచ్చారు.

ఇంతే కాకుండా 12 ఫ్రేమ్స్ లో సింక్ మిస్ కాకుండా నటన, డైలాగ్ డెలివరీని మిస్ చెయ్యకుండా పంజాబీలో మాట్లాడుతూ నటించడం అనేది ఒక్క కమల్ మాత్రమే చెయ్యగలరు అని శంకర్ తెలిపారు. మరి ఈ వయస్సులో కూడా కుమార్ ఈ రేంజ్ డెడికేషన్ ని కంప్లీట్ చూపించడం అంటే హ్యాట్సాఫ్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు