గ్రాండ్ రీ రిలీజ్ కి సిద్దమైన కమల్ హాసన్ ఎపిక్ మూవీ

Published on Sep 19, 2023 12:00 am IST

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీ భారతీయుడు 2 తో పాటు హెచ్ వినోద్ తో ఒక మూవీ అలానే మణిరత్నంతో మరొక మూవీ కూడా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీస్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఒకప్పటి కమల్ హాసన్ సూపర్ హిట్ ఐకానిక్ మూవీ పుష్పక విమానం త్వరలో రీరిలీజ్ కి సిద్ధం కాగా తాజాగా మరొక మూవీ కూడా రీరిలీజ్ కానుంది.

కమల్ హాసన్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఎపిక్ మూవీ నాయకుడు. ఈ మూవీ అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది. కాగా ఈ ఎపిక్ మూవీ నవంబర్ 3న తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుందని నిర్మాతలైన ఏటీఎం ప్రొడక్షన్స్ వారు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే తెలుగు రీరిలీజ్ పై మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. 4కె వర్షన్ లో డాల్బీ అట్మాస్ టెక్నాలజీ సౌండ్ తో ఈ మూవీ ప్రదర్శితం కానుంది. పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించిన నాయకుడు మూవీకి ఇళయరాజా సంగీతం అందించగా దీనిని మణిరత్నం అత్యద్భుతంగా తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :