లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “ఇండియన్ 2” మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంతో పాటుగా తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో కమల్ తన కెరీర్ 234వ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన “నాయకుడు” సినిమాని అయితే ఎవరూ మర్చిపోలేరు.
అందుకే ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసాక ఒక ఎగ్జైట్మెంట్ అందరిలో నెలకొంది. అయితే లేటెస్ట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో కమల్ ఓ ఆసక్తికర అప్డేట్ ని అయితే అందించారు. తాము మళ్ళీ నాయకుడు రోజుల్లానే వర్క్ చేస్తున్నామని తప్పకుండా అంతా తలెత్తుకునేలా సినిమా ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఇప్పుడు ఆ సినిమా కోసం తాను గడ్డం కూడా పెంచుతున్నానని కూడా తెలిపారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ రివీల్ వైరల్ గా మారింది.