“భారతీయుడు 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన కమల్.!

Published on Jun 18, 2022 2:00 am IST

ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం “విక్రమ్” భారీ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో చేసిన ఈ చిత్రం కమల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాదికి తమిళ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం కన్నా ముందు ఇండియాస్ టాప్ దర్శకుడు శంకర్ తో “ఇండియన్ 2” చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా షూటింగ్ మధ్యలో ఆగాల్సి వచ్చింది. అయితే దీనిపై కమల్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం డెఫినెట్ గా శంకర్ డైరెక్షన్ లోనే రీస్టార్ట్ అవుతుంది అని ఇంకా ఫ్యాన్స్ కన్నా నేనే ఒకింత ఎక్కువ ఎగ్జైటెడ్ గా ఉన్నానని ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ చేసేశాక మాదే మొదలవుతుంది అని కమల్ లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :