లోకేష్ కోసం ఇంట్రెస్టింగ్ ప్రామిస్ ఇచ్చిన కమల్ హాసన్..!

Published on Jun 18, 2022 7:04 am IST

లేటెస్ట్ గా మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి చిత్రం “విక్రమ్”. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఫహాద్ ఫాజిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే స్టార్ హీరో సూర్య నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించాడు. అయితే లోకేష్ ఇచ్చిన ఈ చిత్రంతో నిర్మాణం వహించిన కమల్ భారీ లాభాలను కూడా చూసారు.

దీనితో ఈ విజయం పట్ల ఎంతో ఎమోషనల్ అయ్యిన కమల్ దర్శకుడు లోకేష్ కి మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రామిస్ ఇంతకు ముందే ఇచ్చారు. లోకేష్ తనతో సినిమాలు చేయకపోయినా కూడా తన సపోర్ట్ ఏ రకంగా కావాలన్నా ఉంటుంది అని తెలిపారు. లేటెస్ట్ గా కూడా లోకేష్ నెక్స్ట్ విజయ్ తో చేసే సినిమాకి కూడా ఏమన్నా సహకారం కావాలి అంటే అందిస్తానని తాను తెలిపారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :