కమల్ కు ఆ సినిమానే చివరిది కానుంది !

kamal haasan

లోకనాయకుడు కమల్ హాసన్ ,శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 లో నటించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా తెరకెక్కనుంది ఈచిత్రం. డిసెంబర్ 14నుండి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇక కమల్ ఈ చిత్రంతో నటనకు స్వస్తి చెప్పనున్నారు. ఇటీవల ఆయన ‘మక్కల్ నీది మయం’ అనే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ తన పార్టీని బరిలోకి దించేలా ప్లాన్ చేసుకుంటున్నాడట.

దాంతో భారతీయుడు 2 చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి కమల్ పొలిటికల్ గా బిజీ కానున్నారట. అయితే ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ‘శభాష్ నాయుడు’ అనే చిత్రాన్ని కూడా పూర్తి చేస్తాన్నాడు కానీ ఇప్పుడు కమల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సినిమాను శాశ్వతంగా పక్కకు పెట్టినట్లే.

Exit mobile version