“ఇండియన్ 2” సెన్సార్ యూనిట్ టాక్ లీక్ చేసిన కమల్

“ఇండియన్ 2” సెన్సార్ యూనిట్ టాక్ లీక్ చేసిన కమల్

Published on Jul 6, 2024 6:00 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ కొన్ని ఇబ్బందులు తర్వాత మొదలు కాగా ఎట్టకేలకి మొత్తం కంప్లీట్ చేసి మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు. దీనితో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శంకర్ అలాగే కమల్ లు అగ్రెసివ్ గా చేస్తుండగా ఈ ప్రమోషన్స్ లో కమల్ ఇంట్రెస్టింగ్ లీక్ ని అయితే అందించారు.

మాములుగా సెన్సార్ యూనిట్ వారు పెద్దగా మాట్లాడరు కానీ అలాంటిది ఇండియన్ 2 సినిమాని చూసిన తర్వాత ఎన్నో ప్రశంసలు కురిపించారు అని కమల్ తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అలాగే శంకర్ కూడా సెన్సార్ యూనిట్ వారికి ఇండియన్ 2 నచ్చింది అని తెలిపారు. దీనితో అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు