“విక్రమ్” పై మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఇచ్చిన కమల్.!

Published on Jun 2, 2022 8:03 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా “విక్రమ్” పై ఇప్పుడు భారీ స్థాయి హైప్ నెలకొంది. కమల్ తో పాటు మరికొందరు విలక్షణ నటుల కలయికలో దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే మన తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కమల్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

ఈ సినిమాలో ప్రధాన నటులు ప్రతి ఒక్కరి పాత్ర థియేటర్స్ లో ఆడియెన్స్ ని ఆశ్చర్య పరుస్తోంది అని ఒక్కో రోల్ లో రెండు షేడ్స్ ని లోకేష్ డిజైన్ చేసి అద్భుతంగా రాబట్టాడు అని ఖచ్చితంగా ఇవి మెప్పిస్తాయని ఈ సినిమాని థియేటర్స్ లో చూసి అంతా ఎంజాయ్ చెయ్యాలని కమల్ తెలిపారు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సాలిడ్ మ్యూజిక్ అందించగా కమల్ తన బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :