విజయ్ మూవీ రిలీజ్ తో ఆలోచనలో పడ్డ కమల్ మూవీ మేకర్స్ ?

Published on Feb 4, 2023 3:01 am IST


ఇళయదళపతి హీరోగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ లియో. నేడు అఫీషియల్ గా టైటిల్ అనౌన్స్ చేయబడ్డ ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీని దీపావళి కానుకగా 2023 అక్టోబర్ 19న విడుదల చేస్తున్నట్లు నేడు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో ఒకింత చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ చేస్తున్న మూవీ భారతీయుడు 2. నిజానికి చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారని, అయితే ఇప్పుడు విజయ్ లియో మూవీ సడన్ గా డేట్ అనౌన్స్ చేయడంతో ఆ మూవీ మేకర్స్ ఒకింత ఆలోచనలో పడ్డట్లు చెప్తున్నారు. నిజానికి భారతీయుడు 2 తో పాటు అటు రామ్ చరణ్ 15 వ మూవీ కూడా చేస్తున్న శంకర్, భారతీయుడు 2 ని దీపావళి కి అలానే చరణ్ మూవీని 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారట.

ఇక ఇప్పుడు విజయ్ మూవీ దీపావళికి వస్తుండడంతో ఒకవేళ కమల్ మూవీ కూడా అదేసమయంలో రిలీజ్ చేస్తే థియేటర్స్ సమస్య ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట. ఒకవేళ కమల్ భారతీయుడు 2 పోస్ట్ పోన్ చేసి 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఆ పై చరణ్ మూవీ సమ్మర్ కి వెళ్లాల్సి వస్తుందని అలానే దీనిపై అతి త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుందో పక్కాగా ఈ సినిమాల్లో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :