“భారతీయుడు 2” కి కమల్ రికార్డు స్థాయి రెమ్యునరేషన్.?

Published on Sep 25, 2022 8:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న కొన్ని చిత్రాల్లో కోలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు ఉండగా ఈ చిత్రాల్లో వాటిలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “ఇండియన్ 2” కూడా ఒకటి.

అప్పట్లో సంచలన విజయం సాధించిన ఇండియన్, తెలుగులో భారతీయుడు కి సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయ్యి షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కమల్ తీసుకున్నటువంటి భారీ రెమ్యునరేషన్ కోసం కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది.

మరి వారు చెప్తున్నా దాని ప్రకారం ఈ సినిమాకి కమల్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మరి ఇంత మొత్తం అంటే కోలీవుడ్ నుంచి ఇది భారీ మొత్తం అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :