కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదలైన మాచర్ల నియోజకవర్గం “చిల్ మారో” సాంగ్..!

కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదలైన మాచర్ల నియోజకవర్గం “చిల్ మారో” సాంగ్..!

Published on Jun 1, 2022 12:00 AM IST

యూత్ స్టార్ నితిన్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు భారీ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా లోని మొదటి పాట “చిల్ మారో”ను విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదల చేశారు. కమల్ హాసన్ హీరోగా నటించిన “విక్రమ్” సినిమా తెలుగు రైట్స్ నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఇదే వేదికపై కమల్ హాసన్ నితిన్ సినిమా పాటను విడుదల చేశారు.

ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాయగా, నకాష్ అజీజ్ మరియు సంజన కల్మంజే ఆలపించారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు